ఆర్ఎస్ఎస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు.. ఎవరినీ మతం మార్చే అవసరంలేదు !
1 min read
పల్లెవెలుగు వెబ్: మతమార్పిడులపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎవరినీ మతం మార్చాల్సిన అవసరం లేదని, భారతదేశాన్ని విశ్వ గురువుగా మార్చడానికి సమన్వయంతో ముందుకు సాగాలని మోహన్ భగవత్ ఉద్బోధించారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎవరినీ మతం మార్చాల్సిన అవసరం లేదని, జీవించడం ఎలాగో నేర్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రపంచం మొత్తానికి ఇలాంటి పాఠాలు చెప్పడానికే మనం భారత దేశంలో పుట్టామని చెప్పారు. ఎవరి ఆరాధనా విధానాన్ని మార్చకుండా .. ఆర్ఎస్ఎస్ మంచి మనుషులను తయారు చేస్తుంది అని ఆర్ఎస్ఎస్ చీఫ్ అన్నారు. గతానికి భిన్నంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తించాయి.