ఆర్టీసీ బస్టాండ్… గ్యారేజ్ ఆకస్మిక తనిఖీ
1 min read
ఆకస్మిక తనిఖీ చేపట్టిన జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు
ఆర్టీసీ సంస్థ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విజయవాడ జోన్ 2 జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు గురువారం ఏలూరు కొత్త బస్టాండ్ లోని ఆర్టీసీ డిపోను ఆకస్మిక తనిఖీ చేశారు. ఏలూరు డిపో గ్యారేజ్ నందు మెకానికల్ స్టాప్, మరియు ఔట్సోర్సింగ్ స్టాప్ ఎంతమంది పనిచేస్తున్నారు అనే వివరములు తెలుసుకొని గ్యారేజ్ నందు వాషింగ్ ప్లాంట్ మరియు మిగిలిన విభాగములను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన ఆర్టీసి కార్మిక సంఘ నాయకులతో మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని అప్పుడే ఆర్టీసీ సంస్థ అభివృద్ధి మరింత ముందుకు వెళుతుందని, మీకు కావాల్సిన అన్ని విషయాల్లో నా వంతు సహాయ సహకారాలు ఉంటుందని మనందరికీ ఈ సంస్థ మనుగడ ముఖ్యమని తెలియజేశారు.అదేవిధంగా ఆర్టీసీ ఆసుపత్రి సందర్శించి నిశితంగా ప్రతి విషయాన్ని పరిశీలించి కార్మికులకి అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు వారికి అండగా నిలబడి మంచి వైద్యాన్ని అందించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఏలూరు డిపో మేనేజర్ బి. వాణి,అసిస్టెంట్ మేనేజర్ జి.మురళి,ఎం.ఎఫ్.ఐ.ప్రేమ్ కుమార్,అన్ని కార్మిక సంఘాల నాయకులు, పి.ఆర్వో నరసింహం తదితరులు పాల్గొన్నారు.
