కోనసీమ తిరుపతిగా ప్రఖ్యాతిగాంచిన వాడపల్లి క్షేత్రానికి ఆర్టీసీ బస్సులు
1 min read
ఏలూరు డిపో నుండి ప్రతి శనివారం ఉదయం నాలుగు గంటలకు నడపటం జరుగుతోంది
జిల్లా రవాణా శాఖ అధికారి..ఎం.వి.ఆర్ వరప్రసాద్
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏలూరు డిపో నుండి కోనసీమ తిరుపతిగా ప్రఖ్యాతిగాంచిన వాడపల్లి క్షేత్రానికి ప్రతి శనివారం బస్సులు నడుపటం జరుగుతోంది.ఇందులో భాగంగా కైకలూరు నుండి వాడపల్లి వెళ్లే ప్రయాణికుల కోరిక మేరకు ప్రతి శనివారం ఉదయం నాలుగు గంటలకి ఏలూరులో బయలుదేరి ఐదు గంటలకు కైకలూరు చేరుకుని అక్కడనుండి ఆకివీడు, కాపవరం,గణపవరం, పిప్పర,తాడేపల్లిగూడెం మీదుగా వాడపల్లి చేరుకుంటుంది. తిరిగి గం.11.30 ని. వాడపల్లి నుండి బయలుదేరి పైన వెళ్లిన మార్గంలోని కైకలూరు మీదుగా ఏలూరు చేరుకుంటుంది. కావున ఈ సదావకాశాన్ని భక్తులందరూ వినియోగించుకోవాలని ఏలూరు జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి యన్.వి.ఆర్ వరప్రసాద్ ఒక ప్రకటనలో తెలియజేశారు.