ఆర్టీసీ.. పేర్లు పెడితే నగదు బహుమతి !
1 min readపల్లెవెలుగువెబ్ : నష్టాలు తగ్గించుకునేందుకు ఆర్టీసీ కొన్ని వినూత్న నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పలు సంస్కరణలను అమలు చేస్తోంది. ప్రయాణికులను ఆకర్షించేందుకు కొన్ని రూట్లలో వీకెండ్ కాకుండా ఇతర రోజుల్లో ప్రయాణించేవారికి డిస్కౌంట్ల వంటివి కూడా అమలు చేస్తోంది ఏపీఎస్ఆర్టీసీ. దూరప్రాంతాలకు తిరిగే బస్సులకు పేర్లు సూచించాలని ఆర్టీసీ ఎండీ ప్రకటించారు. గతంలో దూరప్రాంతాలకు ప్రయాణించే బస్సులకు పలు పేర్లుండేవి. అవి ప్రయాణించే మార్గాల్లోని ప్రముఖ ప్రాంతాలు, ఆలయాలు, నదులను సూచిస్తూ ఆ పేర్లుండేవి. ఉదాహరణకు తిరుమల, శ్రీబాలాజి, గోదావరి, కృష్ణవేణి, కోనసీమ ఎక్స్ ప్రెస్ లాంటి పేర్లుండేవి. ఆ తర్వాత క్రమంగా అవి కనుమరుగయ్యాయి. ఐతే మరోసారి అలాంటి ప్రయోగమే ఆర్టీసీ చేపడుతోంది. జనాలకు మరింత దగ్గరయ్యేందుకు వారితోనే పేర్లు పెట్టించాలని ఫిక్సైంది. అందుకే కొత్తగా వచ్చే స్లీపర్ సర్వీసులకు పేర్లు సూచించాలని ప్రకటన విడుదల చేసింది. ఈ బస్సులకు పేరప్లు పెట్టాలనుకునేవారు oprshoapgmail.com కు మెయిల్ పంపాలని ఆర్టీసీ పేర్కొంది. ప్రజల నుంచి వచ్చిన సూచనల ఆధారంగా వాటిని సెలెక్ట్ చేసి నగదు బహుమతులు అందిస్తామని ఆర్టీసీ తెలిపింది.