PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శివరాత్రికి ముస్తాబైన రుద్ర కోటేశ్వరుడు

1 min read

పల్లెవెలుగు వెబ్ వెలుగోడు: శ్రీశైలం నియోజకవర్గo లోని ఆత్మకూరు – వెలుగోడు ప్రాంతాల్లో నల్లకాల్వ గ్రామానికి 15 కి.మీ దూరంలో నల్లమల అడవిలో వెలిసిన ప్రముఖ శైవ క్షేత్రo రుద్రకోటేశ్వర స్వామి దేవాలయం మహాశివరాత్రి కి ముస్తాబైనది.ఈ దేవాలయం నకు పురాణ కలదు.1935 లో చంద్ర తిరుపెమ్ రెడ్డి ఈ ప్రాంతంలో పశువుల ను మేపుతూ నిద్రించిన సమయంలో కలలో రుద్ర కోటేశ్వర స్వామి కనిపించి సమీపంలో ని పుట్టలో శివలింగం ఉందని , జీర్ణోద్ధరణ జరుపుమని అజ్ఞాపించారు. పుట్ట త్రవ్వి చూడగా , శివలింగం బయట పడింది. ఆ శివలింగం ను చుట్టు ప్రక్కల గ్రామస్థుల సహకారంతో జీర్ణోద్ధరణ గావించినట్లు శాసనములు తెలుపు చున్నవి. అప్పటి నుంచి మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుతున్నారు.ఈ మహక్షేత్రం లో ఈశ్వరుడు స్వయంభూ లింగరూపంలో వెలసినాడని పురాణ గాథలు చెపుతున్నాయి.ఈ క్షేత్రం లో పూర్వం రావణ సoహరణనo తరం శ్రీ రామచంద్రులు ఈ స్వయంభూ శివలింగాన్ని దర్శించి తరించి నట్లు చరిత్ర చెబుతోంది.బ్రహ్మాది దేవతలు , సకల మహర్షులు ఈ క్షేత్రాన్ని నిత్యం దర్శించుకుంటున్నారని ప్రజా వాక్కు . శ్రీ లక్ష్మి సమేతుడై విష్ణు మూర్తి ఇచ్చట మల్లికార్జున స్వామిని సేవిస్తుంటారని స్థల మహిమ చాటు తున్నది.ఈ క్షేత్రం లో నేటికి కూడా ఈశ్వరుడు జ్యోతి రూపంలో , నాగేంద్రుడు రూపములో కొందరి భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఈ మహక్షేత్రం ను దర్శించే వారు దారి తప్పినచో కోయదంపతుల రూపంలో క్షేత్రం నకు దారి చూపడం ఎంతో మంది భక్తులకు అనుభవమైనది.ఈ క్షేత్రం నకు ఈశాన్యం దిక్కున గల కల్పవృక్షం నకు ఐదు కొమ్మలు కలవు.బూడిద రంగులో ఉన్న ఈ చెట్టును ఎచ్చట తాకినను పాలు స్రవించును. ఈ చెట్టు నీడన ఒక షిద్దుడు తపస్సు చేసినట్లు పురాణ విదితం.ఈ చెట్టును పూజించిన వారికి సంతానం లేక పోతే సంతానం కలుగుతుందని పలువురు నమ్ముతున్నారు.చంద్ర తిరుపెమ్ రెడ్డి వంశస్థులైన డాక్టర్ శివ శంకర రెడ్డి , వారి సతీమణి సీతాలక్షమ్మ వారిచే శివార్చన , లక్ష దీపార్చన శ్రీ రుద్రకోటేశ్వర దేవతలకు శివరాత్రి మహోత్సవం జరపబడును.మహాశివరాత్రి రోజు ఉదయం 7 గంటల నుంచి మరుసటి రోజు 7 గంటల వరకు కర్ణాటక శివస్వామి ఆధ్వర్యంలో శివనామ సంకీర్తన ఏకాహాo జరుగును.19తేదీ ఉదయం 9 గంటలకు శివ పార్వతుల కళ్యాణం జరుగును. శివరాత్రి జాగరణ సందర్భంగా వరదరాజాస్వామి నాట్యకళామండలి వారిచే రామాంజనేయ యుద్ధం , సత్య హరిశ్చంద్ర , పడక సీను , భవానీ సీను , సుభద్ర సీను పౌరాణిక నాటికలు ప్రదర్శిస్తారని , బోయరేవుల గ్రామ భజన మండలి వారిచే భజనలు , ఎర్రగుడూర్ , శాంతినిలయం వారిచే ప్రభలు తెస్తారని ఆలయ నిర్వాహకులు శివ శంకర రెడ్డి తెలిపారు.

About Author