PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యువనేతను కలిసిన రుద్రవరం మైనారిటీలు..

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు నియోజకవర్గం రుద్రవరం మైనారిటీలు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.గత ప్రభుత్వం పేద ముస్లిం యువతుల వివాహానికి దుల్హన్ కింద రూ.50 వేల ఆర్థిక సాయాన్ని అందించింది. కానీ ఈ ప్రభుత్వం దుల్హన్ పథకాన్ని నిర్వీర్యం చేసింది.దుల్హన్ పథకానికి అర్హులు కావాలంటే కఠినమైన షరతులు పెట్టింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక పాత విధానాన్ని అమలు చేయాలి. ముస్లింలపై ఈ ప్రభుత్వం వచ్చాక దాడులు, దౌర్జన్యాలు ఎక్కువయ్యాయి. వాటిని అరికట్టేందుకు ప్రత్యేక రక్షణ చట్టం తేవాలి.ముస్లిం విద్యార్థులకు ఉర్దూను ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో అమలు చేయాలి.  ఉర్దూ టీచర్ పోస్టులను భర్తీ చేయాలి.ప్రతి మండలంలో ముస్లింలకు కమ్యూనిటీ భవనం, షాదీఖానాలు నిర్మించాలి.స్మశానాలు, మసీదుల అభివృద్ధికి నిధులు కేటాయించాలి.నారా లోకేష్ మాట్లాడుతూ… ముస్లింల అభివృద్ధికి టీడీపీ ప్రవేశపెట్టిన 10 సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం రద్దు చేసింది. టీడీపీ అయిదేళ్లలో దుల్హాన్ పథకం కింద 32,722 మందికి రూ. 163.61 కోట్లు ఇవ్వగా, వైసిపి ప్రభుత్వం వచ్చాక 300మందికి కూడా పథకాన్ని అమలుచేయలేదు.పేద ముస్లిం కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని ఆనాడు దుల్హన్ పథకాన్ని ప్రవేశపెట్టాం. కానీ తాను అధికారంలోకి వస్తే లక్ష రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చిన జగన్ మాటతప్పి, మడమతిప్పారు. టీడీపీ వచ్చాక అడ్డగోలు నిబంధనలు తొలగించి దుల్హాన్ పథకాన్ని కొనసాగిస్తాం.జగన్ ప్రభుత్వం ముస్లింలను పనిగట్టుకొని వేధింపులకు గురిచేస్తోంది.తాజాగా మదనపల్లిలో అక్రమ్ అనే మైనారిటీని సోదరుడ్ని పులివెందుల బ్యాచ్ వెంటాడి పొట్టనబెట్టుకుంది.వైసీపీ వచ్చాక ముస్లింలపై 50కి పైగా అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలు జరిగినా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు.టిడిపి అధికారంలోకి వచ్చాక గతంలో అమలుచేసిన సంక్షేమ పథకాలన్నింటినీ పునరుద్దరిస్తాం. షాదీఖానాలు, ఖబరిస్థాన్ లు, మసీదుల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

About Author