విద్యార్థుల భవిష్యత్తు నాశనం… అధికారులు పట్టించుకోవటం లేదు
1 min read– స్టూడెంట్ ఫెడరేషన్ ఇండియా..
పల్లెవెలుగు వెబ్ పాణ్యం : మండల కేంద్రంలో జిల్లా పరిషత్ హై స్కూల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పడినవి. అన్ని ఒకే చోట ఉండడం వలన విద్యార్థుల అవస్థలు పడుతున్నారు. ఈ యొక్క స్కూలుకు కాంపౌండ్ వాల్ లేక దాదాపుగా 50 సంవత్సరాల నుండి చుట్టూ కాంపౌండ్ వాల్ లేక విద్యార్థులకు రక్షణ లేక తల్లిదండ్రులు వాపోతున్నారు. అని SFI నంద్యాల జిల్లా సహాయ కార్యదర్శి బత్తిన ప్రతాప్ వనము వెంకటాద్రి మాట్లాడుతూ స్కూల్లోకి ఎవరు పడితే వాళ్ళు రావడం ,రాత్రి సమయాలలో అసాంఘిక కార్యక్రమాలు అక్కడే జరుగుతా ఉన్న అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసిన ఏ అధికారి కూడా స్పందించడం లేదని చుట్టూ కాంపౌండ్ వాల్ లేనందువలన స్కూల్ ఆవరణము చుట్టూ షాపులు కేటాయించుకొని విద్యార్థులకు భద్రత లేకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు విద్యార్థులు చెడిపోతూ, షాపులు అక్కడే ఉండడం వలన , విద్యార్థులు బీడీలు, మందు, గుట్కాలుకు అలవాటు పడుతూ విద్యార్థులు చెడిపోతున్నారని ఇప్పటికైనా అధికారులు సమస్యను పరిష్కరించాలని కోరారు అనంతరం ఎస్సై అశోక్ . తాసిల్దార్ శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు.