NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలి : బి. గోపిరాజు

1 min read

పల్లెవెలుగు, వెబ్ విజయవాడ: శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానంలో నిబంధనలకు అనుగుణంగా పాటించవలసిన రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయకపోవడం పై గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి బి గోపిరాజు డిమాండ్ చేశారు . స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అగ్రకులాల అహంకారంతో వ్యవహరిస్తూ గిరిజన ఉద్యోగి అయిన బాణావతు నాగేశ్వరరావు పట్ల అమ్మవారి ఆలయంలో గిరిజన మనోభావాలు హక్కులకు భంగం కలిగించే విధంగా ఈవో భ్రమరాంబ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దుర్గగుడి ఈవో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి ఎస్టీ తెగకు చెందిన నాగేశ్వరరావు కు విధిగా రావలసిన ప్రమోషన్ అడ్డుకుంటున్నారని గిరిజన నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు .ఈ సందర్భంగా గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి కోట నాయక్ మాట్లాడుతూ సీనియర్ అసిస్టెంట్ నాగేశ్వరరావు రూల్ ఆఫ్ రిజర్వేషన్లతో 25. పాయింట్లుఉండగా తన తర్వాత వరుసలో ఉన్నవారికి ప్రమోషన్లు నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చారని ఉన్నత అధికారుల నుండి వచ్చిన ఆదేశాలను అమలు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపణలు చేశారు. దుర్గగుడి ఈవో భ్రమరాంబ వెంటనే ప్రమోషన్ కల్పించి న్యాయం చేయలేని పక్షంలో దళిత గిరిజన బీసీ సంఘాలతో కలిసి విజయవాడలో ధర్నా చౌక్ లో ఆందోళన చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు ఏ .సాయి రమేష్, పి శ్యామ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు .

About Author