PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్రంలో గాడి తప్పిన పాలన… నిద్రావస్తలో పాలకులు

1 min read

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు   కే బాబురావు  

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన దాడి తప్పిందని కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కే బాబు రావు గారు విమర్శించారు. ఆదివారం ఆదోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన జిల్లా కాంగ్రెస్ కమిటీ నియోజకవర్గ ఇన్చార్జీలు కోఆర్డినేటర్ల అనుబంధ సంఘాల సమీక్ష సమావేశంలో బాబురావు గారు మాట్లాడుతూ ఒకవైపు అంగన్వాడీలు మరోవైపు మున్సిపల్ కార్మికులు తిరుగుబాటు జెండా ఎగురవేసి వారి న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని అడిగితే, ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేకుండా అంగన్వాడీల పైన ఏస్మా చట్టం ప్రయోగించడం ఎంతవరకు సమంజసమని, అంగన్వాడి సెంటర్లు మూతపడి బాలింతలు, గర్భవతులు, చిన్నపిల్లలు తీవ్ర అవస్థలు పడుతున్నారని, అలాగే మున్సిపల్ కార్మికుల సమ్మె వల్ల వీధులలో చెత్త పేరు కొనిపోయి అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి వారి న్యాయమైన డిమాండ్ లుపరిష్కరించాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తున్నదని కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ పెద్దలను కానీ విమర్శిస్తే వారి నాలుకలు కోస్తామని ఇప్పుడున్నది అసలు సిసలైన కాంగ్రెస్ వాదులు అని జోకర్లు సంపాదించుకొని వెళ్లిపోయారని ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మీకు ఎలాంటి సమస్యలు వచ్చిన గాని పరిష్కరించేందుకు ముందు ఉంటామని కౌన్సిలర్ గా గెలవలేని వారు ఎమ్మెల్యేలు అవుతున్నారని, గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉచితంగా లభించే ఇసుకకు తెలుగుదేశం మరియు వైసీపీ ప్రభుత్వాలు వెలకట్టి సామాన్యులకు అందనంత ధరలు నిర్ణయించాయని ప్రకృతి ప్రసాదించిన ఇసుకకు వెలకట్టడం ఏంటని  ప్రశ్నించారు. అలాగే విదేశీ విద్య, ఫీజు రియంబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన అంటూ గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పక్క రాష్ట్రం కర్ణాటకలో చదువుకునే పేద బీసీ విద్యార్థులకు ఈ పథకాలు వర్తించడం లేదని వారి తల్లిదండ్రులు అధికారులకు విన్నవించిన పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం మాట ఇచ్చి మడమ తిప్పిందని వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అలాగే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని చేయడమే ప్రతి కార్యకర్త ఆశయమని తెలియజేశారు. సమావేశంలో కొన్ని తీర్మానాలు చేయడమైనది గత ఎన్నికల్లో పోటీ చేసి పార్టీ కోసం కష్టపడుతున్న అభ్యర్థులకే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలని, అలాగే గత ఎన్నికల్లో పోటీ చేసి పార్టీలు మారి దూరంగా ఉన్న అభ్యర్థులకు కాకుండా, నియోజకవర్గంలో కార్యకర్తలకు అందుబాటులో ఉండి పార్టీ కార్యక్రమాలు చేసే అభ్యర్థులకు టికెట్ ఇవ్వాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మూలింటి మారెప్ప పీసీసీ ప్రధాన కార్యదర్శి దామోదరం రాధాకృష్ణ, ఆదోని నియోజకవర్గం బి నీలకంఠప్ప, పిసిసి సహాయ కార్యదర్శి చిప్పగిరి లక్ష్మీనారాయణ, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఈ లాజరస్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు మారుతి రావు, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎస్ ప్రమీల, సేవాదళ్ జిల్లా అధ్యక్షురాలు ఏ వెంకట సుజాత రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు కొత్తపేట మున్న డిసిసి కార్యదర్శులు రియాజుద్దీన్ ఎజాస్ అహ్మద్ ఆదోని నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దేవిశెట్టి వీరేష్ ఎస్టీ సెల్ అధ్యక్షులు సుంకన్న కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ హై సాయినాథ్, శ్రీనిద్ ఆలూరు మరియు పత్తికొండ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

About Author