PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్రామీణ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

1 min read

అటవీ శాఖ అధికారి రవీంద్ర ధామ్

అటవీశాఖ అధికారి బాధితునికి రూ:10,000/- లుచెక్కు అందజేత

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు జిల్లా ద్వారాకతిరుమల మండలము కొత్తగూడెం గ్రామం, రామశింగవరం పంచాయితీకి చెందిన ముక్కపల్లి బాల సుందరం లేగ దూడను ఈనెల 30వ తేదీన  పెద్దపులి చంపి తినివేయడం వలన వారికి ఆర్థికంగా ఆ కుటుంబానికి నష్టం వాటిల్లింది. అటవీ శాఖ తరుపున పరిహారమును రూ.10,000/- ల చెక్కును మంగళవారం ఏలూరు జిల్లా అటవీశాఖాధికారి రవీంద్ర ధామ్ బాధితునికి అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లోనీ ప్రజలు అధైర్య పడవద్దని అధికారుల సూచనలు పలు జాగ్రత్తలు తీసుకుని మెసలుకోవాలన్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సూచించారు.  కార్యక్రమంలో  , ఆటవీ క్షేత్రాధికారి ఎస్.వి.కె. కుమార్ తదితరులు పాల్గొన్నారు.

About Author