రష్యా విజయం సాధించింది !
1 min read
పల్లెవెలుగువెబ్ : రష్యా తీరుపై మరోసారి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవతా కారిడార్, ఓడరేవు నగరమైన మరియుపోల్‌లోకి వెళ్లకుండా రష్యా అడ్డుకుంటోందని ఆరోపించారు. ఎందుకంటే అక్కడ వేలాది మంది ఉక్రెయిన్ పౌరులను రష్యా బలగాలు చంపేశాయని తెలిపారు. తాము అక్కడికి వెళితే రష్యా సైన్యం అసలు స్వరూపం బయటపడుతుందన్న కారణంగా అడ్డుకుంటున్నారని విమర్శించారు. సాక్ష్యాలను దాచడంలో రష్యా విజయం సాధించిందని ఆయన ఆవేదన వ్యక్త పరిచారు. తమను చూసి రష్యా భయపడుతోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.