శాంతి చర్చలకు ఆహ్వానించిన రష్యా.. ఉక్రెయిన్ ఏం చెప్పిందంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : రష్యాతో శాంతి చర్చలకు తాము సిద్ధమేనని ఉక్రెయన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. బెలారస్ సరిహద్దుల్లో చర్చలకు అంగీకారం తెలిపారు. దీనికి ముందు, బెలారస్ వేదికగా చర్చలు జరిపేందుకు రష్యా చేసిన ప్రతిపాదనను జెలెన్‌స్కీ నిరాకరించారు. బెలారస్ గడ్డపై నుంచి కూడా తమపై దాడులు జరుగుతున్నందున ఉక్రెయిన్‌పై దూకుడు ప్రదర్శించని ప్రాంతంలో చర్చలకు జరపడానికి వస్తామని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ఉక్రెయిన్ బృందం రాకపోవడంతో చర్చలకు రాకుండా ఉక్రెయిన్ నాయకత్వం సమయం వృథా చేస్తోందనంటూ పుతిన్ వెనువెంటనే ఆరోపించారు. రష్యా ఆహ్వానాన్ని ఒప్పుకోవాలంటూ బెలారస్ అధినేత అలెగ్జాండర్ లుకాషెంకో సైతం ఉక్రెయిన్‌కు విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా ఉక్రెయిన్ చర్చలు జరపడం మంచిదని ఆయన సూచించారు. దీంతో కొద్ది గంటల్లోనే జెలెన్‌స్కీ మనసు మార్చుకున్నారు. బెలారస్‌లో చర్చలకు అంగీకరిస్తున్నట్టు ప్రకటించారు.