PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ర‌ష్యా `కింజ‌ల్ ` దాడులు.. ఎలా చేస్తారు అంటే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఉక్రెయిన్‌పై తొలిసారి అత్యాధునిక ‘కింజల్‌’ హైపర్‌ సోనిక్‌ క్షిపణులను ర‌ష్యా ప్రయోగించింది. ఇవి ధ్వని కంటే 10 రెట్ల అధిక వేగంతో ప్రయాణించగలవు. 2000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలుగుతాయి. వీటిని మిగ్‌-31 యుద్ధవిమానాల ద్వారా ప్రయోగించారు. ఈ క్షిపణి గగనతల రక్షణ వ్యవస్థలను అధిగమించి దూసుకెళ్లగలదు. ‘‘పశ్చిమ ఉక్రెయిన్‌లోని ఇవానో-ఫ్రాన్కివ్స్క్‌ రీజియన్‌లో ఉన్న ఉక్రెయిన్‌ క్షిపణులు, మందుగుండు సామగ్రి నిల్వ ఉంచిన భూగర్భ గిడ్డంగిని కింజల్‌ క్షిపణులు ధ్వంసం చేశాయి’’ అని రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి మేజర్‌ జనరల్‌ ఇగోర్‌ కొనషెంకోవ్‌ తెలిపారు.

                                    

About Author