భారత్ కు మరోసారి మద్దతిచ్చిన రష్యా
1 min readపల్లెవెలుగువెబ్: భారత్ కు చిరకాల మిత్రదేశం రష్యా అంతర్జాతీయ వేదికపై మరోసారి బాసటగా నిలిచింది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వంపై రష్యా తన మద్దతు ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రసంగిస్తూ, భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వానికి భారత్ కు అన్ని అర్హతలు ఉన్నాయని స్పష్టం చేశారు. భారత్ తో పాటు బ్రెజిల్ కు కూడా శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. భద్రతామండలిలో తీసుకురావాల్సిన మార్పులపై ప్రతిపాదనల పరంగా భారత్ ప్రముఖ పాత్ర పోషిస్తోందని తెలిపారు. మండలిలో ఆసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల ప్రాతినిధ్యాన్ని విస్తరించడం అవసరమని, తద్వారా మండలిలో ప్రజాస్వామ్యం వెల్లివిరుస్తుందని వివరించారు.