ఉక్రెయిన్ పై దాడికి సిద్ధంగా రష్యా !
1 min readపల్లెవెలుగువెబ్ : ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగడం ఖాయమని అమెరికా అధ్యక్షుడు బైడెన్ పునరుద్ఘాటించారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ దాకా చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా వచ్చే వారంలోనే దాడి జరుగుతుందని నమ్ముతున్నానని చెప్పారు. రష్యా బలగాలు ఉక్రెయిన్ సరిహద్దుల వద్ద జోరుగా ఫ్లాగ్ ఆపరేషన్లు జరుపుతూ కవ్విస్తున్నాయని చెప్పుకొచ్చారు. అవసరం లేని ఈ వినాశకర దాడికి దిగితే రష్యా పశ్చాత్తాపపడేలా చేసి తీరతామని ఆయన హెచ్చరించారు.