యుద్ధం ప్రారంభించిన రష్యా.. భారీ నష్టాలతో స్టాక్ మార్కెట్
1 min readపల్లెవెలుగువెబ్ : ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రారంభించింది. ఈ మేరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటన చేశారు. యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు నేలచూపులు చూస్తున్నాయి. ఉదయం నుంచే భారీ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. కొన్ని వందల కంపెనీలు లోయర్ సర్క్యూట్ ని తాకాయి. మరోవైపు రష్యా పై యూఎస్, యూకే ఆంక్షలు మొదలయ్యాయి. శాంతి దిశగా రష్యాతో చర్చించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రపంచ దేశాలను కోరారు. 1 గంట సమయంలో సెన్సెక్స్ 1930 పాయింట్ల నష్టంతో 55301 వద్ద, నిఫ్టీ 605 పాయింట్ల నష్టంతో 16475 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
x