NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ర‌ష్యా, ఉక్రెయిన్ వివాదం.. అంగుళం కూడ వ‌ద‌ల‌బోమ‌న్న ఉక్రెయిన్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ర‌ష్యా, ఉక్రెయిన్ దేశాల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఉక్రెయిన్ పై ర‌ష్యా యుద్ధానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. ఇందులో భాగంగా ఉక్రెయిన్‌పై ప్రత్యక్ష యుద్ధానికి దిగకుండా రెండు వేర్పాటువాద ప్రాంతాలను స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తించింది. అక్కడి వేర్పాటువాదులను తమ వైపునకు తిప్పుకుని యుద్ధానికి సన్నద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఉక్రెయిన్‌లో వేర్పాటు వాద ప్రాంతాలకు రష్యా దళాలు ఇప్పటికే చేరుకుంటున్నాయి. డాన్‌బాస్‌ ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా ప్రకటించిన రష్యాపై ఉక్రెయిన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక్క అంగుళం కూడా వదులుకునేది లేదని ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్‌కీ స్పష్టం చేశారు.

                                    

About Author