PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాహు,కేతు పూజలు చేసిన రష్యా దేశీయులు

1 min read

పల్లెవెలుగువెబ్ : తాజాగా రష్యాకు చెందిన ఓ భక్తుల బృందం ఏపీలోని శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి విచ్చేసింది. ఈ శైవక్షేత్రానికి విచ్చేసిన రష్యా దేశస్థులు రాహుకేతు పూజలు చేశారు. ఆలయ సిబ్బంది వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ రష్యా బృందంలో 25 మంది సభ్యులు ఉన్నారు. శ్రీకాళహస్తి ఆలయ సౌందర్యాన్ని వీక్షించిన వారు ముగ్ధులయ్యారు. ఇక్కడి శిల్ప కళ అద్భుతమని కొనియాడారు. ఇక్కడి అమ్మవార్లను కూడా దర్శించుకుని పూజలు చేశారు.

                          

About Author