రష్యా ఆయుధం ఇండియాలో ?
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్దూ మూసేవాలా హత్యలో కొత్త కోణం వెలుగుచూసింది. ఈ హత్యకు ఏకే-47 రైఫిల్‌ను వాడినట్టు తొలుత పోలీసులు భావించారు. కానీ.. ఆ ప్రదేశంలో లభించిన 30 బుల్లెట్ షెల్స్‌ను పరిశీలించిన తర్వాత ఏఎన్-94 రైఫిల్‌ను వాడారనే నిర్ధారణకు వచ్చారు. రష్యాకు చెందిన ఈ ఆయుధాన్ని అక్కడి సాయుధ బలగాలే వినియోగిస్తాయి. మరి ఆ రైఫిల్ ఇక్కడికెలా వచ్చింది? అనే అనుమానం మొదలైంది. ఇక్కడి గ్యాంగ్‌లు వాడడం సంచలనంగా మారింది. ఏకే-47 కంటే ప్రాణాంతకమైనదిగా భావించే ఏఎన్-94 రైఫిల్‌పైనే చర్చ నడుస్తోంది. రష్యా ఆయుధం భారత్ కు ఎలా వచ్చిందన్న ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది.