NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ర‌ష్యా కీల‌క నిర్ణ‌యం .. చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మ‌న్న పుతిన్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఉక్రెయిన్ పై యుద్ధం ప్రారంభించిన ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ మ‌న‌సు మార్చుకున్నారు. ఉక్రెయిన్ తో చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. శుక్రవారం సాయంత్రం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మాట్లాడిన తర్వాత ఈ ప్ర‌క‌ట‌న చేశారు. ఉక్రెయిన్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధమని పుతిన్ ప్రకటించారు. ఇరు దేశాలకు సరిహద్దు దేశమైన బెలారస్ రాజధాని మింస్క్‌ను చర్చల కోసం ఎన్నున్నారు. మింస్క్‌కు తమ ప్రతినిథులను పంపించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు పుతిన్ కార్యాలయ అధికార ప్రతినిధి డ్మిర్టీ పెస్కోవ్ పేర్కొన్నారు. ఎన్ని దేశాలు హెచ్చ‌రించినా.. వెన‌క్కి త‌గ్గ‌ని పుతిన్.. చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించడం ఆస‌క్తిక‌రంగా మారింది.

                                          

About Author