ఒమిక్రాన్ కట్టడికి.. రష్యా కొత్త వ్యాక్సిన్
1 min readపల్లెవెలుగు వెబ్: దక్షిణాఫ్రికాతో పాటు పలు దేశాల్లో కరోన వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వణుకు పుట్టిస్తోంది. ఒమిక్రాన్ వైరస్ పట్ల ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. వివిధ దేశాలు .. ఒమిక్రాన్ రిస్క్ ఉన్న దేశాల నుంచి ట్రావెల్ బ్యాన్ చేశాయి. ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో రష్యా ఓ శుభవార్త చెప్పింది. ఈ వేరియంట్ కు వ్యతిరేకంగా కొత్త వ్యాక్సిన్ తయారీ మొదలుపెట్టినట్టు తెలిపింది. స్పుత్నిక్ వ్యాక్సిన్ కొత్త వెర్షన్ ప్రారంభిస్తున్నట్టు రష్యా ప్రకటించింది. స్పుత్నిక్ వి, స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్‌లు ఓమైక్రాన్ వేరియంట్‌ను తటస్థీకరిస్తాయో లేదో అధ్యయనం చేస్తున్నామని గమలేయా కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త స్పుత్నిక్ ఒమైక్రాన్ వెర్షన్ 45 రోజుల్లోనే భారీ ఉత్పత్తికి సిద్ధంగా ఉంటామని రష్యా ప్రకటించింది. 2022 ప్రారంభంలో స్పుత్నిక్ ఒమైక్రాన్ బూస్టర్ షాట్‌లు పెద్ద మొత్తంలో అంతర్జాతీయ మార్కెట్‌లోకి ప్రవేశించవచ్చని రష్యా భావిస్తోంది.