NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘రుయా’ మ‌ర‌ణాలు..ప్రభుత్వ హ‌త్యలే..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: తిరుప‌తి రుయా ఆస్పత్రిలో ఆక్సిజ‌న్ అంద‌క ప్రాణాలు కోల్పోయిన 11 మంది మ‌ర‌ణాలు.. ప్రభుత్వ హ‌త్యలే అని టీడీపీ జాతీయ కార్యద‌ర్శి నారాలోకేష్ ఆరోపించారు. ఆక్సిజ‌న్ అంద‌క 11 మంది ప్రాణాలు కోల్పోవ‌డం జ‌గ‌న్ ప్రభుత్వ వైఫ‌ల్యమే అని అన్నారు. ఈ ఘ‌ట‌న దిగ్ర్భాంతికి గురిచేసింద‌ని అన్నారు. పాల‌న చేత‌గాక‌పోతే.. జ‌గ‌న్ ప‌ద‌వి నుంచి దిగిపోవాల‌ని డిమాండ్ చేశారు.
జ‌గ‌న్ పై కేసు న‌మోదు చేయాలి: అచ్చెన్నాయుడు
పాల‌న చేత‌కాక‌పోతే జ‌గ‌న్ ప‌ద‌వి నుంచి తొల‌గిపోవాల‌ని అన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయిడు. తిరుప‌తి రుయా ఆస్పత్రిలో జ‌రిగిన దారుణానికి జ‌గ‌న్ మీద కేసు నమోదు చేయాల‌ని డిమాండ్ చేశారు. మృతుల బంధువులను ఆదుకోవాల‌ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

About Author