నేటి నుండి బలివే.. మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవం
1 min read– దేవస్థానం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు: ముసునూరు మండలం ఏలూరు జిల్లా మహాశివరాత్రి స్థిర వారం శని త్రయోదశి పురస్కరించుకొని శ్రీ భలే రామలింగేశ్వర స్వామి దేవస్థానము (భలే రామస్వామి) మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవాలు 17వ తేదీ శుక్రవారం నుండి 19వ తేదీ ఆదివారం వరకు నిర్వహించబడతాయని ఆలయ కార్యనిర్వహణ అధికారి తల్లాప్రగడ విశ్వేశ్వరరావు మరియు గ్రామ సర్పంచ్ రావు ప్రవీణ సుధాకర్ బుధవారం విలేకరుల సమావేశంలో తెలియజేశారు, (ఆలయ స్థల పురాణము)ఈ దేవాలయము 12వ శతాబ్దంలో త్రేతాయుగంలో లింగప్రతిష్ట జరపబడినదిగా చెప్పవచ్చు , ఈ భూమి చుట్టూ ప్రక్కనల నూరు లింగ ప్రతిష్టలు కాగలవని ఈ ఆలయంలో నిన్ను దర్శించిన భక్తులు సర్వకోరికలు తీర్చి సర్వ దోషాలు హరింప పడతాయని రామస్వామికి తెలియజేసినారు. అప్పటినుండి శ్రీ రామలింగేశ్వర స్వామిగా పేరుగాంచి తదనంతరం బలి చక్రవర్తి పరిపాలించిన దేశముగా చెప్పేదరు. అందుచే భలే రామస్వామి అనే పేరుతో భక్తులు స్వామివారిని పిలుస్తూ ఉన్నారు. ఈ ప్రదేశానికి బలివే అని పేరు శాశ్వతమైనది. ఈ గ్రామ పరిసర ప్రాంతాలలో పూర్వo101 ఒక్క లింగ ప్రతిష్టలు ఉండేవి. కాలక్రమేణ అవి శిథిలాలు కాగా నాలుగైదు మాత్రమే మిగిలి యున్నవి.వీటిలో ముఖ్యమైనవి శ్రీ మృత్యమల్లేశ్వర స్వామి వారి ఆలయం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయమునకు 1కిలోమీటర్ దూరంలో తాతగుడిగా ఈ ఆలయం పిలువబడుచున్నది,శ్రీ రామలింగేశ్వర స్వామి రథోత్సవ నాడు తాత గుడికి వెళ్లి ఆశీర్వాదం తీసుకునే సాంప్రదాయం ఉంది. గురువారం ఉదయం భలే రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆలయ ట్రస్ట్ బోర్డు నూతన కమిటీ నియామకం జరిగింది. (నూతన కమిటీ సభ్యులు)నాగుల నాగేశ్వరరావు అధ్యక్షులు, మరియు చిలిమంత నిర్మల, జంపన రాహేలు, కాటూరు పద్మలత, ముతినేని రాంబాబు, నారదల లక్ష్మణరావు, చిడికలపూడి జితేంద్ర లక్ష్మణ కాళీ వరప్రసాదరావు, టి అరుణ భాస్కర్, అక్బర్, ఎక్స్ అఫీషియో మెంబర్స్ గా ఎన్నికయ్యారు, రాష్ట్రంలోనే పేరుగాంచిన బలిలే మహోత్సవాలకు వివిధ జిల్లాల నుండి విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.నూతనంగా ఎన్నికైన మా కార్యవర్గం తమ వంతు సహకారం అందిస్తామని ఎమ్మెల్యేలు మేక ప్రతాప్, కొట్టారు అబ్బయ్య చౌదరి, మరియు దేవదయ ధర్మదాయ శాఖ సంబంధిత అధికారులు సూచనల మేరకు కమిటీ సభ్యులమంతా నిబద్దతో సేవలు అందిస్తామని ఆలయ అభివృద్ధికి మరింత కృషి చేస్తామని ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి పాల్గొన్నారు.