PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోలీస్​ అమరవీరుల త్యాగం.. చిరస్మరణీయం..

1 min read

– కమాండెంట్​ ఎన్​. శ్రీనివాసరావు
పల్లెవెలుగు వెబ్​, కడప: పోలీస్​ అమరవీరుల త్యాగాలు… చిరస్మరణీయమన్నారు కమాండెంట్​ ఎన్​. శ్రీనివాసరావు. గురువారం కడప బాకర్​పేట్​ 11వ బెటాలియన్​లో పోలీస్​ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కమాండెంట్​ ఎన్​.శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలీసుల అమరవీరుల ధైర్య,సాహసాలను ప్రతిఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.

జీవితమంటే తన కోసం.. కుటుంబ సభ్యుల కోసం కాదని.. ప్రజలను కాపాడటం కోసమని నమ్మి దేశ రక్షణకై ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులకు ఈ సందర్భంగా ఆయన శ్రధ్దాంజలి ఘటించారు. ఆ తరువాత పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులకు మెమోంటోలు, చెక్​లు అందజేశారు. కార్యక్రమంలో పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులు, 11వ బెట్టాలిన్ పోలీస్ కమాండెంట్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.


About Author