PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భక్తుల గుండెల్లో సద్గురు మహాత్మ బడే సాహెబ్ తాత

1 min read

– మహిమాన్వితునిగా విరాజిల్లుతున్న గంజిహాల్లి శ్రీశ్రీశ్రీ సద్గురు మహాత్మా బడేసాహెబ్ తాత
– నేడే శ్రీశ్రీశ్రీ సద్గురు మహాత్మ బడేసాహెబ్ స్వామి వారి ఉరుసు మహోత్సవం
– శ్రీ శ్రీ సద్గురు మహాత్మా బడే సాహెబ్ స్వామివారి ఉరుసు ఉత్సవాలకు జిల్లా నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి వేల సంఖ్యలో తరలివస్తున్న భక్తులు
పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: గోనెగండ్ల మండలపరిదిలోని గంజిహాల్లి గ్రామంలో కులమతాలకు అతీతంగా భక్తులచే ప్రతినిత్యం పూజలందుకుంటూ మతసామరస్యానికి ప్రతీకగా మహిమాన్వితుడై వెలసిన శ్రీశ్రీశ్రీ సద్గురు మహాత్మ బడేసాబ్ స్వాముల వారి ఉరుసు మహోత్సవం ఈనెల 25,26,27వ తేదిలలో శ్రీశ్రీశ్రీ సద్గురు మహాత్మ బడేసాబ్ స్వాముల వారి ఉరుసు మహోత్సవం కుల మతాలకతీతంగా జిల్లా నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా వేల సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.భక్తులగుండెల్లో మహిమాన్వితునిగా విరాజిల్లుతున్న గంజిహాల్లి మహాత్మా బడేసాహెబ్గోనెగండ్ల మండలంలో గంజిహాల్లిలో స్వామి వారి క్షేత్రం వెలసింది.స్వామి వారి ఉత్సవాలకు జిల్లాలోనే కాక ఆంద్రప్రదేశ్,తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర మరియు కర్ణాటక రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారు.ఈ ఉరుసు మహాత్సవంలో శ్రీ బడేసాహెబ్ స్వాముల వారికి బ్రాహ్మ జ్ఞానాన్ని బోధించి సంపూర్ణ ఉపదేశమిచ్చిన గురువు శ్రీశ్రీశ్రీ గద్వాల తిమ్మగురువు స్వాముల వారికి నైవేద్య పూజలు నిర్వహించి స్వామి వారి దర్గాలో సాంప్రదాయబద్ధంగా ఫాతేహాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేస్తారు.
సద్గురు మహాత్మా బడేసాహెబ్ స్వామి వారి చరిత్ర: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ తాలూకా పోదాల కందుకూరు గ్రామానికి చెందిన భీయమ్మ,జిందే సాహెబ్ లు కుమారుడు మహాత్మ బడేసాహెబ్.పువ్వు పుట్టగానే పరిమలిస్తుంది అన్న చందంగా బడేసాహెబ్ చిన్న నాటి నుండే అధ్యాత్మికథను వంట పట్టించుకున్నాడు.తన మహిమలు చూపుతూ గంజిహాల్లి గ్రామానికి చేరుకున్నాడు.గ్రామంలో అనేక మహిమలు చూపడమే కాక ప్రజల కష్టాలు తీర్చి మహిమాన్వితుడుగా పేరు గాంచాడు.ఆ రోజుల్లో తను ఉన్నచోటి నుంచే ప్రముఖ పుణ్యక్షేత్రాలను భక్తులకు చూపించేవారని ఎన్నో మహిమలు చూపుతూ భక్తులను మైమరపించేవారని 1894వ సంవత్సరంలో స్వాముల వారు జీవ సమాధి అయ్యారు. నాటి నుండి స్వామి వారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.
సద్గురు మహాత్మ బడే సాహెబ్ తాత వెలసిన గ్రామంలో ప్రత్యేకత:గంజిహాల్లి గ్రామంలో నివసిస్తున్న ప్రజలు పాలు ఎవ్వరికి అమ్మరు….ఎవ్వరి దగ్గర కొనరు..అంతేగాకుండా గ్రామ శివారులో అవును వధించరు.అవును వేధిస్తే..వదించిన వారికి కుష్టువ్యాధి రావడమే గాక వారి వంశం అంతరించిపోతుందని తరాలుగా వస్తున్న ఆచారం. ఈ ఆచారాన్ని గంజహళ్లి గ్రామంలోనీ ప్రజలు కులమతాలకు అతీతంగా ఇప్పటికీ ఆచరిస్తారు.
ప్రతి గురువారం అన్నదానం:ఇక్కడికి వచ్చే వందలాది మంది భక్తులకు ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం చేపడతారు.అలాగే ప్రతి అమావాస్య రోజున భక్తులకు అన్నదాన కార్యక్రమ నిర్వహిస్తారు.
ఉరుసు మహోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు:ఈ నెల 25,26,27వ తేదీలలో జరిగే ఉరుసు ఉత్సవాలను పురస్కరించుకుని దర్గా వంశపారంపర్య పీఠాధిపతులు మరియు దర్గా కమిటీ, గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో భక్తుల సంరక్షణ కై ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.తాగునీటి వసతి,చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు.ఇప్పటికే దర్గాను రంగులతో అందంగా ముస్తాబు చేసి విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు.ఎమ్మిగనూరు ఆర్ టి సి డిపో భక్తుల కోసం ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పిస్తుంది.అలాగే గోనెగండ్ల పోలీసు శాఖ వారు ఉరుసును పురస్కరించుకొని ఇద్దరు సీఐలు 9 మంది ఎస్ఐలు 110 మంది పోలీస్ సిబ్బంది మరియు 30 మంది వాలంటీర్లతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేస్తారు.ఉరుసుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని దర్గా పీఠాధిపతులు సయ్యద్ చిన్న ముద్గోలు, ధర్మకర్త కుబేర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ రాముడు లు తెలిపారు.

About Author