సురక్షితమైన ప్రసవాలు జరిగేలా చూడాలి
1 min read– అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఖాదర్ వలీ
పల్లెవెలుగు , వెబ్ చెన్నూరు: ప్రభుత్వ ఆసుపత్రులలో సులభ సురక్షితమైన ప్రసవాలు జరిగే విధంగా చూడాలని అదేవిధంగా, ఆసుపత్రులకు వచ్చే గర్భవతులకు సకాలంలో అన్ని పరీక్షలు నిర్వహించి తగిన సూచనలు సలహాలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్య అధికారి అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఖాదరవల్లి అన్నారు. బుధవారం ఆయన స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే గర్భవతులకు అన్ని పరీక్షలు సక్రమంగా నిర్వర్తించి వారికి అన్ని సేవలు సకాలంలో అందే విధంగా వైద్య సిబ్బంది చర్యలు చేపట్టాలని ఆయన వైద్య సిబ్బందికి సూచించారు, అలాగే గర్భవతుల యొక్క ఎం సి పి కార్డులను ఆయన పరిశీలించారు, మీకు సక్రమమైన వైద్య పరీక్షలు వైద్య సిబ్బంది నిర్వహిస్తున్నారా లేదా అని స్వయంగా అడిగి తెలుసుకున్నారు, గర్భవతులు తమకు సంబంధించిన అన్ని పరీక్షలు సకాలంలో చేయించుకోవాలని వారికి తెలియజేశారు, అనంతరం మండలంలోని శివాల పల్లి లో జరిగిన ఫ్యామిలీ ఫిజీషియన్ 104 వాహనం ద్వారా జరిగిన వైద్య సేవలను ఆయన ఆరా తీశారు, ప్రజల ముంగిటికే ఫ్యామిలీ డాక్టర్ ద్వారా వైద్య సేవలు అంతే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలియజేశారు, అదేవిధంగా వైద్య సిబ్బంది కి సూచిస్తూ, ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేయాలని ఆయన అక్కడి వైద్య సిబ్బందికి తెలియజేశారు, ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ బి చెన్నారెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ డాక్టర్ సాగర కుమారి, డాక్టర్ సుమ, వైద్య సిబ్బంది ఆశా వర్కర్లు పాల్గొన్నారు.