జంక్ ఫుడ్ తో భద్రం !
1 min readపల్లెవెలుగువెబ్ : సరైన పోషకాలులేని సరిపడా కేలరీలు లేని ఆహార పదార్థాలను జంక్ ఫుడ్స్ అంటారు. జంక్‌ఫుడ్స్‌తో ఉబకాయంతో పాటు మతిమరుపు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పిజ్జాలు, బర్గర్లు, వగైరా ఆహార పదార్థాలు తినేవారిలో మతిమరుపు సమస్య తలెత్తే ప్రమాదం ఉందని ఆస్ర్టేలియా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కొవ్వు అధికంగా చక్కెర, ఉప్పు అధిక కేలరీలు కలిగిన ఆహారాన్ని తీసుకుంటే అది మెదడుపై ప్రభావం చూపుతుందని వారు హెచ్చరిస్తున్నారు. స్కూల్ విరామ సమయాల్లో కూడా చాలా మంది పిల్లలు ఇదే తరహా ఆహారం తీసుకుంటున్నారు. ఇంట్లో స్నాక్స్‌ను ప్రిపేర్ చేస్తుండగా, మరి కొంతమంది పిల్లలు ఇంటి నుంచి తీసుకొని వెళ్లి డబ్బులతో చిప్స్ శాండ్‌విచ్‌లు మొదలైన ఆహార పదార్థాలను తింటున్నారు. వీటిలో 82 శాతం కొవ్వు ఉంటుంది. ఇడ్లీ, ఉతప్ప, పరోటా వంటివి పెడుతున్నారు. నగరంలో ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే వారిలో 10 శాతం మంది స్థూలకాయంతో బాధపడుతున్నారనే సమాచారం. ఎనిమిది గంటలకే కొన్ని పాఠశాలలు ప్రారంభమవుతున్నాయి. దీంతో వంట చేసే సమయంలేక ఫాస్ట్ ఫుడ్ పై ఆధారపడుతున్నారు.