కర్మాగారాల్లో భద్రత తప్పనిసరి
1 min read
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, న్యూస్ నేడు : జిల్లాలో కర్మాగారాల్లో భద్రతకు అవసరమైన చర్యలు తప్పనిసరిగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు.బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలో కర్మాగారాల్లో చేపట్టాల్సిన భద్రత చర్యలపై సమీక్షించేందుకు ఫ్యాక్టరీస్ శాఖ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న కర్మాగారాల్లో ప్రమాదాలు జరగకుండా నిర్దేశిత ప్రమాణాల మేరకు కచ్చితంగా భద్రతా చర్యలు తీసుకోవాలని కర్మాగారాల యాజమాన్యాల ప్రతినిధులను ఆదేశించారు. హెచ్పిసిఎల్ పైప్ లైన్ ను డ్రోన్ లతో పర్యవేక్షించే అంశంపై పరిశీలించాలని ఫ్యాక్టరీల విభాగం డిప్యూటీ చీఫ్ ఇన్ స్పెక్టర్ కు సూచించారు..కర్మాగారాల్లో మాక్ డ్రిల్ లు తరచుగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.. ఫైర్,పోలీస్, రెవెన్యూ, వైద్య తదితర అత్యవసర విభాగాలు కూడా ఈ మాక్ డ్రిల్ లో పాల్గొనాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు..ప్రమాదకరమైన కర్మాగారాల్లో సబ్ కమిటీ లు ఇచ్చిన నివేదికల మేరకు భద్రతా చర్యలను మరోసారి చెక్ చేయాలని కలెక్టర్ డిప్యూటీ చీఫ్ ఇన్ స్పెక్టర్ ను ఆదేశించారు..డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్ సభ్యులు కూడా టీమ్ గా వెళ్ళి కర్మాగారాల్లో భద్రతా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.అలాగే కర్మాగారాల్లో భద్రతా చర్యలను థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిట్ చేయించాలన్నారు..కర్మాగారాల్లో ప్రమాదాలు జరగకుండా ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు, ప్రమాదాలు జరిగినపుడు ఎలా స్పందించాలి , టోల్ ఫ్రీ నంబర్ తదితర వివరాలను ప్రజలకు తెలిసేలా సమాచారాన్ని సంబంధిత వెబ్ సైట్స్ లో ఉంచాలని, అలాగే వార్తాపత్రిక ల్లో ప్రచురించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డిప్యూటీ చీఫ్ ఇన్ స్పెక్టర్ ను ఆదేశించారు.ఫ్యాక్టరీల విభాగం డిప్యూటీ చీఫ్ ఇన్ స్పెక్టర్ నారాయణ రెడ్డి జిల్లాలో ఉన్న కర్మాగారాల పరిస్థితి గురించి వివరించారు.టిజివి SRAAC లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హెచ్పిసిఎల్ సంస్థల ప్రతినిధులు కర్మాగారాల్లో చేపట్టిన భద్రత చర్యల గురించి వివరించారు. సమావేశంలో కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి అవినాష్ జయసింహ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి, ఇతర సభ్యులు, వివిధ పారిశ్రామిక సంస్థల యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు.