PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎయిడెడ్​ ఉద్యోగుల భద్రతే… ‘ఏపీటీజీ’ లక్ష్యం..

1 min read

ఏపీటీజీ న్యాయమైన డిమాండ్ల నెరవర్చేందుకు కృషి :వక్తలు

పల్లెవెలుగు వెబ్​: ఎయిడెడ్​ ఉద్యోగుల భద్రత…జీతం పెంపు లక్ష్యంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్​ టీచర్స్​ గిల్డ్​ సంఘం…. అన్ని సంఘాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు వక్తలు. 1947లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్​ టీచర్స్​ గిల్డ్​ సంఘం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియంలో వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ఫెడరేషన్ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగ సంఘ అధ్యక్షులు కాకర్ల వెంకట్రామిరెడ్డి, ఉపాధ్యాయ శాసన మండలి శాసన మండలి సభ్యులు T కల్పలత రెడ్డి, ఏపీ మాజీ శాసన మండలి సభ్యులు బి. మోహన్ రెడ్డి  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీటీజీ అధ్యక్షులు బి చిట్టిబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్​.కె. చిన్నప్ప మాట్లాడుతూ ఎయిడెడ్ సిబ్బందికి పెంచిన 62 సంవత్సరాల పదవి విరమణ వయస్సు 1-1-2022 నుండి వెంటనే అమలు చేయాలని,  ఎయిడెడ్ సిబ్బందికి (EHS) హెల్త్ కార్డ్స్ వెంటనే ఇవ్వాలని, ఎయిడెడ్ సిబ్బందిసర్వీసులో  మరణించిన వారసులకు కారుణ్య నియామకాలు వెంటనే G O Ms. No 113 ప్రకారం చేపట్టాలని సభలో కోరారు.  రాబోయే మార్చి, ఏప్రిల్ 2023 లో జరిగే ఉపాధ్యాయ శాసన మండలి (MLC ) ఎన్నికల్లో ఎయిడెడ్ సిబ్బంది తప్పకుండ ఒక నిర్ణయాత్మక శక్తి గా మారి… జయాపజయాలు నిర్ణయిస్తారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ఫెడరేషన్​ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ టి. కల్పలతారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బి. మోహన్​ రెడ్డి మాట్లాడుతూ ఎయిడెడ్​ ఉపాధ్యాయులు, సిబ్బంది డిమాండ్లు న్యాయమైనవేనని, వాటిని నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏపీటీజీ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

About Author