NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వివేక హ‌త్య కేసు.. ఒకే రోజు 8 మంది విచార‌ణ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో విచార‌ణ 14 వ రోజు కొన‌సాగుతోంద‌. క‌డ‌ప జిల్లా సెంట్రల్ జైల్ గెస్ట్ హౌస్ లో అనుమానితుల్ని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఒకే రోజు 8 మందిని విచారిస్తున్నారు. దీంతో విచార‌ణ పై ఆస‌క్తి పెరిగింది. మూడు రోజులుగా వివేకానంద‌రెడ్డి ప్రధాన అనుచ‌రుడు ఎర్ర గంగిరెడ్డిని విచారించిన అధికారులు.. ఈరోజు కూడ ఆయ‌న‌ను విచారిస్తున్నారు. ఆయ‌న‌తో పాటు సింహాద్రీపురానికి చెందిన అశోక్, ఓబుళ‌ప‌తి నాయ‌డు, రాఘ‌వేంద్రను విచారిస్తున్నారు. పులివెందుల‌కు చెందిన శ్రీరాములు, హ‌రినాథ‌రెడ్డి తో పాటు కృష్ణ, సావిత్రి దంప‌తుల‌ను విచారిస్తున్నారు. వివేక హ‌త్యకు ముందు కాల్ డేటా ఆధారంగా వీరందరినీ విచారిస్తున్నట్టు తెలుస్తోంది.

About Author