వివేక హత్యకేసు.. మారణాయుధాల కోసం రోటరీపురం వంకలో సీబీఐ
1 min readపల్లెవెలుగు వెబ్: వివేకా హత్యకేసు నిందితుడు సునీల్‌ను తీసుకొని సీబీఐ బృందాలు పులివెందులకు చేరుకున్నాయి. పులివెందులలోని రోటరిపురం వంక వాగుల్లో సునీల్‌తో కలసి సీబీఐ బృందాలు గాలిస్తున్నాయి. వివేకా హత్యకు ఉపయోగించిన మారణాయుధాల కోసమే గాలిస్తున్నట్లు సమాచారం. రోటరీపురం వంకలో నీటిని పైపుల ద్వారా బయటికి సీబీఐ అధికారులు తోడిస్తున్నారు. పరారీలో ఉన్న సునీల్ యాదవ్ ను సీబీఐ అధికారులు గోవాలో అరెస్ట్ చేశారు. అనంతరం పులివెందుల కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అనుమతితో 10 రోజుల కస్టడీకి తీసుకున్నారు. సునీల్ యాదవ్ ను విచారించడం ద్వార కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని రిమాండ్ రిపోర్టులో సీబీఐ పేర్కొంది. ఈ నేపథ్యంలో రోటరీపురం వంకలో నీటిని బయటికి తోడించడం ఆసక్తికరంగా మారింది.