వివేక హత్య కేసు..హిదయతుల్లను విచారించిన సీబీఐ
1 min readపల్లెవెలుగు వెబ్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ వేగవంతం చేసింది. మూడో రోజు కూడ విచారణ జరుపుతోంది. కడప జిల్లా సెంట్రల్ జైల్లో మూడు రోజులుగా అనుమానితులను విచారిస్తున్నారు. వైఎస్ వివేకా ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసిన హిదయతుల్లాను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. నిన్న 7గంటల పాటు హిదయతుల్లాను ప్రశ్నించిన పోలీసులు.. ఈరోజు కూడ విచారణకు పిలిచారు. పులివెందులకు చెందిన కిరణ్ కుమార్ యాదవ్ అనే వ్యక్తిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. 2019 మార్చిలో వైఎస్ వివేక హత్య కేసు జరిగిన సందర్భంలో వివేక మృతదేహం ఫోటోలను హిదయతుల్లా తీసునట్టు అధికారుల వద్ద ప్రాథమిక సమాచారం ఉంది. హత్య జరిగిన సందర్భంలో వివేక ఇంట్లో ఎవరున్నారు. హత్య జరిగిన తర్వాత బాత్ రూమ్ లో నుంచి బెడ్ రూమ్ లోకి ఎవరెవరు తీసుకెళ్లారు అనే కోణాల్లో సీబీఐ అధికారులు హిదయతుల్లాను ప్రశ్నిస్తున్నారు.