వివేక హత్య కేసు..సునీల్ పాత్ర పై ఆధారాలున్నాయి : సిబిఐ
1 min readపల్లెవెలుగు వెబ్ : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీల్ కుమార్ యాదవ్ పాత్రపై ఆధారాలు లభించాయని సీబీఐ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. సునీల్ ప్రమేయంపై సెక్షన్ 164 కింద వాచ్ మెన్ రంగన్న వాంగ్మూలం ఇచ్చారని సీబీఐ తెలిపింది. సునీల్ యాదవ్ ను విచారణ చేయాలనుకున్నామని , విచారణకు హాజరుకాకుండా సునీల్ పారిపోయాడని సీబీఐ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది. ఈనెల 2న గోవాలో సునీల్ కుమార్ యాదవ్ ను అరెస్టు చేశామని సీబీఐ తెలిపింది. సునీల్ ను సుదీర్ఘ విచారణ చేయాలని, కుట్ర కోణం వివరాలు సునీల్ బహిర్గతం చేయడం లేదని రిపోర్టులో సీబీఐ అధికారులు పేర్కొన్నారు. సునీల్ ను 13 రోజుల కస్టడీకి ఇవ్వాలని, సాక్షులను విచారించాలని.. హత్యకు వాడిన ఆయుధాలు స్వాధీనం చేసుకోవాలని సీబీఐ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. పులివెందుల కోర్టులో సునీల్ ను హాజరుపరచగా.. అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది.