సాహిత్య అకాడమీ నేషనల్ అవార్డ్స్ -2023 పోస్టర్ ఆవిష్కరణ
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ: బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ అవార్డ్స్ 2023 పోస్టర్ ను ఆవిష్కరించిన ఆంధ్రప్రదేశ్ బి.సి. సేన రాష్ట్ర అధ్యక్షులు శొంఠి నాగరాజు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మంచికి చేయూత- సేవలకు ,ఆదరణ ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించే వ్యక్తులకు, సహకారాన్ని బహుజనులకు సాహిత్య సంస్కృతి కళా రంగాలలో ప్రోత్సాహాన్ని అందిస్తున్న బహుజన సాహిత్య అకాడమీ చేస్తున్న కృషి ప్రశంసనీయమని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ అధ్యక్షులు శొంఠి నాగరాజు తోట్లవల్లూరులో మంగళవారం బిఎస్ఎ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన అన్నారు.బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14న ఉయ్యూరులో నిర్వహించ తలపెట్టిన బి.ఎస్.ఎ నేషనల్ అవార్డ్స్ 2023 కార్యక్రమం పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి..ఆర్. అంబేద్కర్ 124వ జయంతి రోజున ప్రపంచ జ్ఞాన దినోత్సవ సందర్భంగా ఉయ్యూరు బైపాస్ రోడ్ లోని గ్రీన్ ల్యాండ్ రిసార్ట్స్ ఆవరణలో బహుజన సాహిత్య అకాడమీ ఎంపిక చేసిన వివిధ రంగాలలోని విశేష సేవలు అందించిన వ్యక్తులకు అవార్డులను అందజేయ పడుతుందని ఆ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు బీసీ హక్కుల ఉద్యమ నిర్మాత ఆర్. కృష్ణయ్య తోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు రాజకీయ పార్టీల నాయకులు వివిధ రంగాల ప్రముఖులు హాజరు అవుతారని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ నేతృత్వంలో బి.ఎస్.ఏ ఆంధ్ర ప్రదేశ్ విభాగం అధ్యక్షులు జంపాన శ్రీనివాస్ గౌడ్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం విస్తృత స్థాయిలో జరుగుతుందని ఈ నేపథ్యంలో బి.ఎస్.ఎ. నేషనల్ అవార్డ్స్-2o23 కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించిన బీసీ సేన రాష్ట్ర అధ్యక్షులు నాగరాజు అన్నారు. ఈ సందర్భంగా బి.ఎస్.ఎ సేవా కార్యక్రమంలో తోట్లవల్లూరు ఆరోగ్య కేంద్రంలో రోగులకు, స్థానిక పేదలకు బీసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజు చేతుల మీదుగా పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ శాఖ ముస్లిం మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఆసిఫ్ భాషా బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి దేవరాజు గట్టు, శివ, తోట్ల వల్లూరు మండలం బీసీ నాయకులు గొరిపర్తి సూర్యనారాయణ ,కె .సురేష్ కాటూరి గౌతమి ,కోలా దుర్గ, భవాని ,తదితరులు పాల్గొన్నారు.