సాహిత్య సవ్యసాచి శేషేంద్ర శర్మ
1 min readపల్లెవెలుగు , వెబ్ చెన్నూరు : పద్య వచన కవితా సాహిత్య సవ్యసాచి డాక్టర్ గుంటూరు శేషేంద్ర శర్మ ని భారత రాష్ట్రపతి అవార్డు గ్రహీత విద్వాన్ గానుగపెంట హనుమంతరావు పేర్కొన్నారు, గురువారం సాయంత్రం మండలంలోని శాటిలైట్ సిటీ లోని మహా కవయిత్రి మొల్ల సాహితీ పీఠం కార్యాలయంలో ఏర్పాటుచేసిన శేషేంద్ర శర్మ 96వ జయంతి ని పురస్కరించుకొని గానుగపెంట హనుమంతరావు అలాగే మొల్ల సాహితీ పీఠం, కార్యవర్గ సభ్యులు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా ఆయన జయంతి నీ నిర్వహించారు, ఈ సందర్భంగా విద్వాన్ గానుగపెంట హనుమంతరావు మాట్లాడుతూ, సాహితీరంగంలో అనేక రచనలు చేసి సాహిత్యంతో పలువురి ప్రశంశలు పొందడమే కాకుండా ఆయన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అవార్డు పొంద డం జరిగిందని ఆయన తెలిపారు, అంతేకాకుండా శేషేంద్ర శర్మ ఆధునిక సాహిత్యంపై తనకున్న పట్టుతో తనదైన శైలిలో 30 గ్రంథాలకు పైగా రచనలు చేయడం గొప్ప విశేషం అన్నారు, ఆ మహావ్యక్తి 1927 అక్టోబర్ 20వ తేదీన జన్మించారని ఆయన తెలియజేశారు, శేషాద్రి శర్మ రచనలలో స్వర్ణ హంస, కాలరేఖ, నా దేశం, రక్త రేఖ మొదలగు రచనలు ఎన్నో కూడా ఎంతో ప్రశంసించ పడ్డాయని, అలాంటి మహాభావున్ని మనమంతా మననం చేసుకోవడం ఎంతో ఆనందకరమైన ఆయన తెలియజేశారు, శేషేంద్ర శర్మ రసభరితమైన కవిత్వాలు నేటి కవులకు మార్గదర్శని ఆయన కొనియాడారు, అనంతరం శేషేంద్ర శర్మ జయంతిని పురస్కరించుకుని రచయితలు స్వర్ణలత పట్టాభి రామ రాజుల దంపతుల ను ఆయన ఘనంగా సన్మానించారు.