సాయిబాబా ఆశీస్సులు.. ప్రజలపై ఉండాలి
1 min read41 రోజులపాటు మాలధారులకు అన్నదానం
- మహాభిక్షతో… ముగిసిన అన్నదానం
- సాయి ఆదరణ సేవా సమితి నిర్వాహకులు రాజావిష్ణువర్ధన్ రెడ్డి, నాగరాజు యాదవ్
కర్నూలు, పల్లెవెలుగు:నగరంలోని సాయిబాబా దేవాలయంలో ఆదివారం సాయిబాబా మాలధారులు విశేష పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో బాబాకు పూజలుచేసి, భజనలు చేశారు. మధ్యాహ్నం ఆలయంలో మాలధారులకు (అయ్యప్ప స్వామి,భవాని మాత, సాయిబాబా, ఆంజనేయ స్వామి) అన్నదానం చేశారు. సాయి ఆదరణ సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం మహాభిక్ష ( ముగింపు అన్నదానం) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి ఆదరణ సేవా సమితి నిర్వాహకులు రాజా విష్ణువర్ధన్ రెడ్డి, నాగరాజు యాదవ్ స్వామి మాట్లాడుతూ కార్తీక మాసం ప్రారంభం నుంచి 41 రోజులపాటు ప్రతి రోజు మధ్యాహ్నం దీక్షాపరులకు భిక్ష ( అన్నదానం) చేస్తున్నట్లు తెలిపారు. ఎంతో నియమనిబంధనలతో మాలధరించి… సాయిబాబాకు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు, భజనలు చేస్తున్న దీక్షపరులకు అన్నదానం(భిక్ష) ఏర్పాటు చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. సాయి ఆదరణ సేవా సమితి ఆధ్వర్యంలో 18 సంవత్సరాల నుంచి మాలధారులకు అన్నదానం ఏర్పాటు చేస్తున్నామని, భిక్షకు ఎందరో భక్తులు, దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. మాలధారులపై, ప్రజలపై, భక్తులకు సాయిబాబా ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటున్నామన్నారు. మహాభిక్ష (అన్నదానం) కార్యక్రమంలో సాయి ఆదరణ సేవా సమితి సభ్యులు మంజుస్వామి, రాము స్వామి, విశ్వనాథ్ రెడ్డి స్వామి తదితరులు పాల్గొన్నారు.