NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సైమా అవార్డ్స్.. ఉత్తమ న‌టుడు మ‌హేష్ బాబు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: సౌత్ ఇండియ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ అవార్డ్స్ వేడుక ప్రారంభ‌మైంది. రెండు రోజుల పాటు జ‌రిగే ఈ వేడుక‌లో తెలుగు, త‌మిళ‌, మ‌ళ‌యాళ‌, క‌న్నడ సినీ ప‌రిశ్రమ‌ల‌కు అవార్డులు అందించ‌నున్నారు. సైమా-2019 తెలుగు అవార్డులు ప్రక‌టించారు. ఉత్తమ న‌టుడిగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబును ప్రక‌టించారు. ఉత్తమ చిత్రంగా జెర్సీ. ఉత్తమ ద‌ర్శకుడిగా వంశీ పైడిప‌ల్లి, ఉత్తమ తొలిచిత్ర ద‌ర్శకుడు స్వరూప్ ఆర్ఎస్జే, ఉత్తమ తొలిచిత్ర న‌టుడు శ్రీసింహా, ఉత్తమ తొలిచిత్ర న‌టిగా శివాత్మిక‌, ఉత్తమ తొలిచిత్ర నిర్మాత‌గా స్టుడియో 99, ఉత్తమ క‌మెడియ‌న్ గా అజ‌య్ ఘోష్‌, ఉత్తమ స‌హాయ న‌టుడిగా అల్ల‌రి న‌రేష్ ఎంపిక‌య్యారు.

About Author