NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చెన్నూరు గణేషుడి సేవలో సాయినాధుడు

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు:  చెన్నూరు తూర్పు అరుంధతి నగర్ లో సాయినాథ్ శర్మకు యువత ఆధ్వర్యంలో ఘన స్వాగతం   చెన్నూరు మండలం చెన్నూరు తూర్పు అరుంధతి నగర్ లోని యువకులు నియోజక వర్గ ప్రజా నాయకుడు తెలుగు దేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ కు మంగళవారం రాత్రి పదిగంటల సమయంలో కాలని లోని యువకులు కలిసికట్టుగా ఘన స్వాగతం పలికారు . గణేష్ చతుర్థి సందర్భంగా తూర్పు అరుంధతి నగర్ లో యువకులు ఐక్యమత్యంగా సాయినాథ్ శర్మ ను ఆహ్వానించి ప్రేమతో అభిమానం చాటకున్నారు. తమ కాలని కి ప్రేమతో విచ్చేసిన సాయినాథ్ శర్మ వెంట తాము నడవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. పేదల మనిషి సాయినాథ్ శర్మ భవిష్యత్తులో ఉన్నత స్థానానికి రావాలని తాము కోరు కొంటున్నట్లు కాలని లోని మహిళలు ఆయనతో కలసి మాట్లాడి చెప్పారు. తన మీద ఆదరాభిమానాలు చూపిన వారికీ తాను ఎప్పటికీ ఋణపడి ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు అరుంధతి నగర్ యువత రాంబాబు,ప్రతాప్ కుమార్,వంశీ,హరి,అశోక్,సూర్య, సాయికుమార్, సుబ్బారాయుడు, బ్రహ్మయ్య అరుంధతి నగర్ ప్రజలు పాల్గొన్నారు.

About Author