NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సాయినాథ్ శర్మ సమాజ సేవ, శ్లాఘనీయం

1 min read

– రాష్ట్ర హైకోర్టు జడ్జి వెంకటరమణ ప్రశంస
పల్లెవెలుగువెబ్​, కడప: సమాజసేవ కు పుణ్యభూమి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ చేస్తున్న కృషి ప్రశంశనీయమన్నారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ఎం. వెంకట రమణ. కడపలో ప్రముఖ సాహితీ వేత్త జానుమద్ధి హనుమత్ శాస్త్రి 97 వ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న ఆయన బ్రాహ్మణ సమాజంలో ఉన్న సత్య సాయినాథ్ శర్మ కులమతాలకతీకంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎక్కడా లేని విధంగా పుష్పగిరి క్షేత్రంలో సామూహికంగా పితృదేవతలకు పిండ ప్రధాన కార్యక్రమం నిర్వహించడం గొప్ప కార్యక్రమం ఆన్నారు. రామాపురం పుణ్య క్షేత్రంలో మూడు పూటలా నిత్య అన్నదాన సేవ చేస్తుండడం, లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి పేద ప్రజలకోసం ఉచితంగా కళ్యాణ మంటపం నిర్మించడం, అత్యంత పురాతన దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్టించి నిత్యకళ్యాణం నిర్వహిస్తుండడం, కరోనా సమయంలొ వేలాది మందికి అన్నదాన సేవ, కరోనా రెండవ దశ లో ఉచితంగా ఆక్సిజెన్ సిలెండర్స్ జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేసి అనేకమంది ప్రాణాలు కాపాడడం, నిరుపేదల కళ్యాణాలకు తాళిబొట్లు ఇవ్వడం వంటి అనేక సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సాయినాథ్ శర్మ ధన్యజీవి ఆన్నారు. ఈ సందర్భంగా సాయినాథ్ శర్మ మాట్లాడుతూ తనకు అవకాశం కల్పించిన జానమద్ది హనుమత్ శాస్త్రి గారి కుమారుడు విజయ భాస్కర్ గారికి ధన్యవాదాలు తెలిపారు. తనకు చేతనైనంత వరకు సమాజ సేవ చేసి ప్రజలకు ఉపయోగపడటమే తన లక్ష్యమని తెలిపారు.

About Author