NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

“గ్రామాల సుభిక్షం కోరుతూ సాయినాథ్ శర్మ పూజలు”

1 min read

పల్లెవెలుగు వెబ్ కమలాపురం : గ్రామాలు సుభిక్షంగా ఉండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని శ్రీరామ నవమి సందర్భంగా పుణ్యభూమి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి తెలుగు నాడు ప్రజాసేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ జంబాపురం ఈడిగపల్లి రామాలయాల్లో గురువారం భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆయా గ్రామస్తులు ఆహ్వానం మేరకు శ్రీరామనవమి ఉత్సవాల్లో సాయినాథ్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహంతో పాడిపంటలతో శాంతి సౌభాగ్యాలతో గ్రామాలు సుభిక్షంగా ఉండాలని శ్రీరాముల వారిని ప్రార్థించానన్నారు. ఈడిగపల్లి గ్రామంలో గ్రామ నాయకులు దేశం జగన్ రెడ్డి పాల గంగన్న,నంద్యాల శ్రీనివాసులు, పంగా కృష్ణయ్య నంధ్యాల గంగరాజు చింతా లక్ష్మీరెడ్డి , తిరుపాలు తదితరులు సాయినాథ్ శర్మ ను బాణాసంచా పేల్చుతూ భాజా భజంత్రీలతో శుభంగా ఆహ్వానం పలికారు. జమ్మాపురం గ్రామంలో గ్రామ నాయకులు శ్రీనివాసుల రెడ్డి రామసుబ్బారెడ్డి , జయచంద్ర రెడ్డి తదితరులు సాయినాథ్ శర్మ ను ఆలయానికి ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహింప చేసి దుశ్శాలవతో సన్మానించారు.

About Author