చంద్రబాబుకు గాండీవం, బాణం బహుకరించిన సాయినాథ్ శర్మ
1 min readపల్లెవెలుగు వెబ్, చెన్నూరు: మహాభారతంలో లో అర్జునుడి లాగా గాండీవం తో బాణం ఎక్కుపెట్టి ఆరాచక వైసీపీ పాలనను అంతమొందించాలని తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి సత్య సాయినాథ్ శర్మ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ను కోరారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పై వైసిపి శ్రేణులు దాడికి నిరసిస్తూ చంద్రబాబు నాయుడు చేపట్టిన 36 గంటల నిరసన దీక్షలో శుక్రవారం సాయినాథ్ శర్మ పాల్గొన్నారు.
హౌస్ అరెస్టు నుంచి తప్పించుకుని..
కమలాపురం లో బుధవారం అర్ధరాత్రి నుంచి పోలీసులు సాయినాథ్ శర్మను హౌస్అరెస్ట్ చేసినప్పటికి ఎలాగైనా చంద్రబాబు దీక్షకు వెళ్లాలని నిర్ణయించుకొని పోలీసుల కన్నుగప్పి శుక్రవారం మధ్యాహ్నం మంగళగిరి వెళ్ళి చంద్రబాబును కలిసారు. వేలాది మంది దేశం పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య చంద్రబాబు నాయుడు సత్య సాయినాథ్ శర్మ బహూకరించిన గాండీవమునకు బాణం సంధించగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు జయ జయ ధ్వానాలు పలికారు. సాయినాథ్ శర్మ వెంట రాష్ట్రీయ బ్రాహ్మణ ప్రంట్ రాష్ట్ర నాయకులు గండ్లూరీ మహేష్ , ముత్తుకు మల్లి, రామకృష్ణ , జనార్దన్ రావు, ప్రయాగ కృష్ణ , కమలాపురం తెలుగుదేశం నాయకుడు వెంకటేశ్వర్ , రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్ విజయవాడ నాయకులు ఎం ఎన్ డి ఎస్ ప్రసాద్, రాష్ట్ర మహిళా నాయకురాలు కుసుమ కుమారి తదితరులు పాల్గొన్నారు.