బోగాధమ్మా కు సాయినాథ్ శర్మ పూజలు ..
1 min read
ఆలయ మండల పూజా సేవలో పాల్గొన్న సత్య సాయినాధ శర్మ
కమలాపురం, న్యూస్ నేడు: కమలాపురం మండలం పందిళ్ళ పల్లె గ్రామంలో నూతనంగా ప్రతిష్ట గావింపబడిన భోగాధమ్మ ఆలయంలో, ప్రతిష్ట మండల పూజా సేవలో తెలుగునాడు ప్రజాసేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు వైయస్సార్సీపి రాష్ట్ర నాయకుడు కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ పాల్గొని పూజ చేశారు. గ్రామస్తులు ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు గురువారం మధ్యాహ్నం ఆయన ఆలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి పోతురాజు స్వామికి పూజలు నిర్వహించి ప్రతిష్ట మండల పూజ హోమం పూర్ణాహుతి కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన సాయినాథ్ శర్మ కి ప్రతిష్ట ఆచార్యులు, రామనపల్లె వెంకటేశ్వర శర్మ వేదమంత్ర ఆశీర్వచనం చేసారు. ఆలయ కమిటీ సభ్యులు సాయనాశర్మ కు పూలమాలలు వేసి శాలువ కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా సాయినాథ్ శర్మ మాట్లాడుతూ గ్రామంలో కలిసికట్టుగా గ్రామ దేవత అయిన భోగాదమ్మ ఆలయాన్ని భక్తిశ్రద్ధలతో పునర్నిర్మాణం చేయడం గ్రామానికి శుభ పరిణామమన్నారు. భోగాధమ్మ అమ్మవారు అనుగ్రహంతో పందేళ్లపల్లె గ్రామం పాడిపంటలతో కళకళలాడుతూ దినదినాభివృద్ధి చెందాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమం లో అలయ కమిటీ సభ్యులువెన్నపూస సాయినాథ్ రెడ్డి, కంచంరెడ్డి లక్ష్మి కళ్యాణ్ కుమార్ రెడ్డి,బొర్రా నాగేశ్వర రెడ్డి, అట్లా బాబుల్ రెడ్డి,పెర్ల గోవర్ధన్ రెడ్డి, కొంగాని శ్రీనివాసులు,కళాశాల చెండ్రాయుడు, తదితరులు పాల్గొన్నారు.