సాయినాథ్ శర్మ నిరసనను అడ్డుకున్న పోలీసులు
1 min readముఖ్యమంత్రిని మేమే కలిపిస్తాం
సాయినాథ్ శర్మ కు, రైతులకు పోలీసుల హామీ
సాయినాథ్ శర్మను, రైతులను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
రైతులను ముఖ్యమంత్రి తో కలిపించక పోతే 25 న ఉదయం ఇడుపులపాయి ను ముట్టడిస్తామని హెచ్చరించిన సాయినాథ్ శర్మ
పల్లెవెలుగు వెబ్ కమలాపురం: కమలాపురం నియోజకవర్గాన్ని “కరువు ప్రాంతం”గా ప్రకటించాలని కోరుతూ జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రైతుల విజ్ఞప్తిని తీసుకెళ్లడానికి రైతులతో కలిసి వెళుతున్న కమలాపురం నియోజకవర్గం నాయకుడు” తెలుగు నాడు ప్రజాసేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి” “కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ” ను కమలాపురం పోలీసులు శనివారం ఉదయం అడ్డుకోని హౌజ్ అరెస్ట్ చేశారు. కడపకు శనివారం మధ్యాహ్నం విచ్చేసిన ముఖ్యమంత్రి దృష్టికి కమలాపురం నియోజక వర్గ కరువు పరిస్థితులు తీసుకెళ్లడానికి సాయినాథ్ శర్మ ఆధ్వర్యంలో రైతులు భారీ ఎత్తున కమలాపురం మండలం, రామాపురం నుంచి బయల్దేరారు. అయితే శాంతి భద్రతల సమస్య వస్తుందని భావించిన పోలీసులు ముందస్తు చర్యలలో భాగంగా శనివారం ఉదయం కమలాపురం సబ్ ఇన్స్ పెక్టర్ ఋషి కేశవరెడ్డి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో పోలిసులు సాయినాథ్ శర్మ ఉన్న రామాపురం కు చేరుకొని రైతులను అడ్డుకొని ముఖ్యమంత్రి వద్ధకు నిరసనకు వెళ్లకుండా సాయినాథ్ శర్మ ను రైతులను అడ్డుకున్నారు. కమలాపురం ఎస్సై ఋషి కేశవరెడ్డి,పోలీసులు, “సాయినాథ్ శర్మ కు 41 నోటీసు” ఇవ్వడానికి రాగా ఆయన నోటీసును తిరస్కరించి నిరసన కార్యక్రమానికి బయల్దేరారు. సాయినాథ్ శర్మ వెంట రైతులు కమలాపురం నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమానికి బయల్దేరడం తో జంబాపురం వద్దకు వెళ్ళగానే పోలిసులు రోడ్ కు అడ్డంగా పోలీసు జీప్ ను పెట్టీ సాయినాథ్ శర్మ తో వాహనాలు వెళ్ళకుండా అడ్డుకోవడం తో సాయినాథ్ శర్మ అక్కడే రోడ్ పైన బైటాయించి రైతులకు మద్దతుగా నినాదాలు చేసారు. రోడ్ కు అడ్డంగా కూర్చున్న సాయినాథ్ శర్మ ను కమలాపురం పోలీసులు బలవంతంగా లాగి జీప్ ఎక్కించే ప్రయత్నం చేయగా రైతులు పోలీసుల చర్యలను నిరసిస్తూ రైతులు పోలీసు జీప్ ను అడ్డుకున్నారు. పోలీసులకు రైతులకు తోపులాట జరగడంతో రోడ్ లో చాలా దూరం వాహనాలు నిలిచిపోయాయి. అంతలోనే కమలాపురం. సబ్ ఇన్‌స్పెక్టర్ ఋషి కేశవరెడ్డి పోలీసు ఉన్నతాదికారులతో మాట్లాడి రైతుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడానికి తాము కృషి చేస్తామని రైతులను ముఖ్యమంత్రి వద్దకు తాము తీసుకెళ్తామని గట్టి హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళనను* *విరమించారు.పోలీసులు రేపటి లోగా ముఖ్యమంత్రి తో కలిపించాలని లేకుంటే తాము 25 న* *ఇడుపులపాయ ని ముట్టడిస్తామని పోలీసులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని భారీ సంఖ్యలో రైతులు, రైతుకూలీలు పాల్గొన్నారు.