NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మూర్తీభవించిన సాయినాథుని మానవత్వం

1 min read

– రోడ్డుప్రమాద బాధితుడికి ఆపన్న హాస్తం

– ఆసుపత్రి ఖర్చులకు తక్షణ ఆర్థిక సహాయం

పల్లెవెలుగు వెబ్ కమలాపురం:  రోడ్డు ప్రమాదం లో దెబ్బతిని తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న రామాంజినేయులు  అనే వ్యక్తికి దగ్గర ఉండి సపర్యలు చేసి ప్రొద్దుటూరు ఆసుపత్రి కి పంపించి మానవత్వాన్ని చాటు కున్నారు కమలాపురం ప్రజాసేవ నాయకుడు పుణ్య భూమి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కాశీ భట్ల సత్య సాయినాధ్ శర్మ..ప్రమాద బాధితుడికి సాయినాథ్ శర్మ  దగ్గర ఉండి సపర్యలు చేసి ఉపశమనం కలిగించిన తీరుతో ఆయన మానవత్వం మూర్తీభవించిన వ్యక్తిగా అక్కడ చూసిన వ్యక్తులు పేర్కొంటున్నారు.గురువారం నాడు మద్ద్యాన్నం వీరపునాయిని పల్లె మండల కేంద్రం లో సర్వ రాజుపేట కాలనీలో ఉన్న రాధాకృష్ణ ఆలయంలో సాయినాథ్ శర్మ ఆయన అభిమానులు కోరిక మేరకు కృష్ణాష్టమి పూజ ముగించుకుని కమలాపురం వెళుతుండగా  వీరపనాయన పల్లి గంగిరెడ్డి పల్లె మధ్యలో మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో  వల్లూరు మండలానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి  రోడ్డు ప్రమాదానికి గురై అచేతనంగా ప్రాణాపాయ స్థితిలో పడిపోయి ఉన్న పరిస్థితిని గమనించిన సాయినాథ్ శర్మ తక్షణమే తన వాహనాన్ని ఆపి ప్రమాద బాధితుడి వద్దకు వెళ్లి పరామర్శించారు. అతనికి కొన్ని మంచినీళ్లు తాపీ సపర్యలు చేసి ధైర్యం నింపారు. అక్కడ ఉన్నవారు 108 వాహనానికి సమాచారం ఇవ్వడం తో వాహనం వచ్చే వరకు అక్కడే వేచి ఉండి ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి కి పంపించారు. అప్పటికప్పుడు వారికి తక్షణ ఆసుపత్రి ఖర్చులకు గాను ఐదు వేల రూపాయలు ప్రమాద బాధితుడి తమ్ముడు కుమారుడు ప్రసాద్ కు సాయినాథ్ శర్మ అందించారు. దారిలో వెళుతూ తనకు ఎందుకు లే ఆని అనుకోకుండ తన బాధ్యత తో ప్రమాద బాధితుడుని ఆదుకొన్న సాయినాథ్ శర్మ ను ప్రజలు ప్రశంసిస్తున్నారు.

About Author