సొంతూరికి సాయితేజ పార్థివదేహం
1 min read
పల్లెవెలుగు వెబ్: ఇటీవల ఆర్మీ హెలీకాప్టర్ ప్రమాదంలో మరణించిన లాన్స్ నాయక్ సాయితేజ్ పార్థివదేహాన్ని ఆయన సొంతూరికి తరలించారు. బెంగళూరులోని సైన్యానికి చెందిన కమాండ్ ఆస్పత్రి నుంచి ఆయన సొంతూరు చిత్తూరు జిల్లా ఎగువరేగడకు తరలించారు. చిత్తూరు జిల్లా చీకలబైలు చెక్ పోస్ట్ నుంచి వలసపల్లి మీదుగా ఎగువరేగడకు 30 కిలోమీటర్ల మేర భారీ ర్యాలీతో పార్థివదేహాన్ని తీసుకెళ్తున్నారు. ఈ ర్యాలీలో సాయితేజ బంధువులు, స్నేహితులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున హాజరయ్యారు. సాయితేజ పార్థివదేహం ఎగువరేగడకు చేరిన అనంతరం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తీ అవుతాయి.