టీడీపీ పై విరుచుకుపడ్డ సజ్జల.. ఏమన్నారంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : కొందరు మీడియా పేరుతో టీడీపీ అజెండాను మోస్తున్నారని.. ప్రజల మైండ్‌ను విషపూరితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. అమరావతి పేరుతో అరచేతిలో స్వర్గం చూపించారని, రాజధాని పేరుతో లక్ష కోట్ల భారాన్ని ఏ రాష్టమూ మోయలేదన్నారు. అన్ని ప్రాంతాలూ అభివృద్ధి కోసమే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని, సొంత ప్రయోజనాల కోసమే టీడీపీ డ్రామాలాడుతుందని సజ్జల దుయ్యబట్టారు. ` చంద్రబాబు ముఠా నిన్న వికారపు చేష్టలు చేశారు. మాది రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కాదు. రాష్ట్రం మొత్తం మాకు సమానమే. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు వికేంద్రీకరణ నిర్ణయం.న్యాయవ్యవస్థను మేం గౌరవిస్తాం. ప్రజలు ఎన్నిసార్లు ఓటుతో బుద్ధి చెప్పినా టీడీపీ మారడం లేదు. టీడీపీ వర్గమే నిన్న టపాకాయలు కాల్చి హంగామా చేసిందని
సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.