సజ్జల పదవీ కాలం పొడిగింపు !
1 min read
పల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పదవీ కాలం ఏడాదిపాటు పొడిగించింది ప్రభుత్వం. సజ్జలతో పాటు ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్)గా ఉన్న జీవీడీ కృష్ణ మోహన్ పదవి కాలాన్ని మరో ఏడాది పొడిగించారు. ముఖ్యమంత్రి ప్రిన్సిపాల్ అడ్వైజర్ అజయ్ కల్లం, ప్రభుత్వ సలహాదారు శామ్యూల్ పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ.. తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.