NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జీతాలు పెంచమని అడిగితే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరిస్తారా..

1 min read

 సిఐటియు పట్టణ కార్యదర్శి లక్ష్మన్ 

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  తమ న్యాయపరమైన డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించాలని గత 40 రోజుల నుండి అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నిరవధిక నిరసన దీక్ష చేస్తున్న పట్టించుకోకుండా విధులకు హాజరు కాకపోతే శాశ్వతంగా విధుల నుండి తొలగిస్తామని  అంగన్వాడీలకు బెదిరిస్తున్నారని ఇది ఎంతవరకు సమంజసం అని శనివారం నాడు సిఐటియు పట్టణ కార్యదర్శి లక్ష్మన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు గడివేముల తాసిల్దార్ కార్యాలయం వద్ద దీక్ష చేస్తున్న అంగన్వాడీలకు మద్దతుగా మాట్లాడుతూ ఈనెల 5వ తేదీ ప్రభుత్వం అక్రమంగా ఎస్మా చట్టాన్ని తీసుకువచ్చిందని అప్పటినుండి షోకాస్ నోటీసులు నేడు టెర్మినేట్ చేస్తామని బెదిరించారని ప్రభుత్వం దిగి వచ్చేదాకా ఉద్యమం ఆగదని భయపడే ప్రసక్తే లేదని చట్టపరంగా ముందుకు వెళ్తామని రాష్ట్రవ్యాప్తంగా లక్ష్యం పైచిలుకు ఉన్న అంగన్వాడీలను తొలగిస్తే సామాజిక ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని అంగన్వాడీలకు భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల అంగన్వాడి వర్కర్స్ యూనియన్ నాయకురాలు  వసంతలక్ష్మి. రాములమ్మ. రామ్ చెన్నమ్మ .పాల్గొన్నారు .

About Author