ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు అమ్మకాలు…. ప్రదర్శన..
1 min readసేంద్రీయ పద్ధతుల్లోనే వ్యవసాయ ఉత్పత్తులను పండించాలి..
ఎంపీపీ బత్తుల రత్నకుమారి ఏసు రాజు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల ఆరోగ్య దృశ్య ప్రకృతి వ్యవసాయంపై ప్రతి గృహిణి ఆసక్తి పెంపొందించుకునే విధంగా వ్యవసాయ శాఖ రైతు సాధికార సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం( ఏలూరు డివిజన్) వారిచే ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మ కాలను దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో గురువారం ఉదయం ప్రదర్శన స్టాల్ ను ఏర్పాటు ఎంపీపీ భక్తుల రత్నకుమారి ఏసు రాజు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ దయనందన జీవితంలో రసాయన పండించే పంటల ద్వారా తీసుకునే ప్రతి ఆహార పదార్థలు రసాయన లతో త్వరగతిన ఎక్కువ దిగుబడి ఉత్పత్తులను చేతికి అంది పుచ్చుకునే విధంగా రైతులు పండిస్తున్నారని పెదపాడు మండల ఎంపీపీ బత్తుల రత్నకుమారి యేసు రాజు అన్నారు. రైతులు తనకున్న పొలంలో కొంత భాగాన్ని సేంద్రియ పద్ధతిలో వ్యవసాయ పంటలను పండించి రైతు బజార్లకు అందించాలన్నారు. మనం తీసుకునే ఆహార పదార్థాల ద్వారానే అనారోగ్యం పాలవ్వ టానికి కారణాలవుతున్నాయి, అందుచేత సహజ సిద్ధంగా సేంద్రియ ఎరువులతో పండించిన ఆహారపు ఉత్పత్తులను సేంద్రియ పద్ధతిలో పండించి ఆహార తీసుకుంటే అనారోగ్యం పాలవకుండా ఆరోగ్యంగా ఉంటామన్నారు. మాన జీవిత మనుగడ మరింత మెరుగు అయ్యేవిధంగా ఉండొచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో పెదపాడు మండలం యూనిట్ ఇన్చార్జి డి నాగరత్నం, ఐ సి ఆర్ పి లు పి రాజారెడ్డి, సిహెచ్ కృష్ణకుమారి, డి కుసుమకుమారి, సిహెచ్ సునీతదేవి, కొనుగోలుదారులు తదితరులు పాల్గొన్నారు.