జిల్లా కలెక్టర్ దృష్టికి శాలివాహన కమ్యూనిటీ సమస్యలు
1 min read– ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాలివాహన అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎం.పురుషోత్తం, కమిటీ సభ్యులు..
– భీమవరం జిల్లా కలెక్టర్ శ్రీమతి పి.ప్రశాంతిని మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్చ అందజేత..
– సానకూలంగా స్పందించిన కలెక్టర్ పి ప్రశాంతి
పల్లెవెలుగు వెబ్ పశ్చిమగోదావరి : శాలివాహన సంస్ధ ఛైర్మెన్, కమిటీ సభ్యులు జిల్లా కలెక్టరుతో మాట్లాడుతూ శాలివాహన, కుమ్మరి కమ్యూనిటీ ప్రజలందరూ రాష్ట్ర ప్రభుత్వ నవరత్నాలను పొందుతున్నారని, కమ్యూనిటీ ప్రజలను అన్ని అంశాలలో అభివృద్ధి చెందడానికి కృషి చేస్తున్నట్లు వారు కలెక్టరుకు తెలిపారు. కమిటీ చైర్మన్, సభ్యులు జిల్లా కలెక్టర్ కు విజ్ఞాపన పత్రం అందజేస్తూ శాలివాహన కమ్యూనిటీకి సంబంధించిన సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కమ్యూనిటీలో పలువురు అర్హత కలిగి ఉన్నను జగనన్న చేదోడు పథకం అందలేదని, వీటి పరిశీలనకు తగు చర్య తీసుకోవాల్సిందిగా వారు కలెక్టర్ కోరారు. జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖా అధికారి జివియస్ కె గణపతి రావు, శాలివాహన కమిటీ సభ్యులు బిరుదుకోట చింతన్న, పెనుగొండ లక్ష్మి, సకినేటిపల్లి ఉమామహేశ్వర రావు, యర్రవరపు రామకృష్ణ, పెనుగొండ లక్ష్మి తదితరులు వున్నారు.